వివేకా అల్లుడు వద్ద 4 గంటల పాటు సీబీఐ విచారణ

ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (15:35 IST)
దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా, ఆయన అల్లుడు, డాక్టర్ సునీత నర్రెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వద్ద సీబీఐ అధికారులు నాలుగు గంటల పాటు విచారణ జరిపారు. ఆయనకు సీఆర్పీ 160 కింద నోటీసు ఇచ్చారు. దీంతో ఆయన హైదరాబాద్, కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థులు తనపై చేస్తున్న వారి ప్రశ్నలతో పాటు సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా, వివేకా హత్య స్థలంలో దొరికి లేఖపై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. లేఖనుఎందుకు దాచిపెట్టమని చెప్పాల్సివచ్చిందని సీబీఐ అధికారులు వివరణ అడిగారు. ఆయన వద్ద తక్కువ సమయంలోనే విచారణ పూర్తి చేయడంతో ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు