ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది. అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతును అందిస్తోందని, దాని నిర్మాణానికి రుణాలు పొందడంలో సహాయం చేస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థల నుండి తీసుకున్న రుణాలు ఆంధ్రప్రదేశ్ రుణ బాధ్యతల కింద లెక్కించబడవని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ రుణాలను రాష్ట్ర రుణ పరిమితుల్లో చేర్చరాదని కూడా పేర్కొంది.