పోలవరంపై కేంద్రం షరతులు... 15,668 వేల కోట్లే ఇస్తాం!

శనివారం, 26 మార్చి 2022 (09:51 IST)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం షరతులు పెట్టింది. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌పై డీపీఆర్‌ తయారు చేయాలని నిబంధన పెట్టింది. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో గడువు చెప్పాలని కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ప్రాజెక్టు నిర్మాణానికి 15 వేల 668 కోట్ల రూపాయల వరకే తమ బాధ్యతని తేల్చి చెప్పింది. 
 
లోక్‌సభలో పోలవరంపై వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ వివరణ ఇచ్చారు. 2022 ఫిబ్రవరి వరకు రాష్ట్ర ప్రభుత్వం 14వేల 336 కోట్లు ఖర్చు చేసిందని.. అందులో 12వేల 311 కోట్లు తిరిగి చెల్లించామన్నారు సామాజిక, ఆర్థిక సర్వే మరోసారి నిర్వహించాలంటూ షరతులు విధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు