నవ్యాంధ్ర రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళంపై కేంద్రం మరోమారు క్లారిటీ ఇచ్చింది. రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. పైగా, విభజన చట్టం మేరకు ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని తేల్చి చెప్పింది.
తాజాగా ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ, హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల్లో కేంద్రం పాత్రపై మరింత క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది.