అందరినీ చల్లగా చూడాలని ఆ ప్రభువును కోరుకున్నాం.. బాబు

బుధవారం, 25 డిశెంబరు 2019 (16:22 IST)
క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిలో ప్రార్ధనలలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 
కేక్ కట్ చేసి భక్తులకు పంచి పెట్టారు. ఇంకా మాట్లాడుతూ.. అందరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
ఈ చర్చ్‌కి రెండోసారి వచ్చానని తెలిపారు. ఒక పవిత్ర సందేశం అందిచిన క్రీస్తు జన్మదిన వేడుకలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. దయ, కరుణ, ఇలాంటి దివ్య సందేశాలు ఆయన అందిచారు. మంచిని గుర్తించడం, గౌరవించడం, బైబిల్‌లో పొందుపరిచారు. 
 
క్రిస్మస్ రోజున పవిత్రమైన ప్రదేశంలో ఉండటం ఆనందంగా ఉంది. యేసు ఇచ్చిన సందేశాలు మానవాళి రక్షణకు నిరంతరం ఉపయోగపడతాయి. మనిషిని మనిషిగా గుర్తించడం, సమస్యకు పరిష్కార మార్గాలు బైబిల్‌లో చెప్పారు. మంచి కోసం, ప్రజల క్షేమం కోసం ప్రార్ధనలు చేశాం.

అందరనీ చల్లగా చూస్తూ కరుణ చూపాలని ప్రభువును కోరుకున్నాం. టిడిపి హయాంలో క్రిస్మస్ కానుకులు ఇచ్చాం, చర్చిలకు ఆర్థిక సహాయం చేశాం. క్రైస్తవ సోదరుల‌కు టిడిపి అండగా ఉంటుంది.. అంటూ చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు