రూ.50 వేలకు మించి విత్‌డ్రా చేస్తే పన్ను బాదేయండి : మోడీకి బాబు సూచన

బుధవారం, 25 జనవరి 2017 (09:06 IST)
బ్యాంకు ఖాతాల నుంచి రూ.50 వేలకు మించి విత్‌డ్రా చేసే వారిపై భారీ మొత్తంలో పన్ను బాదాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలోని కమిటీ సూచన చేసింది. ఈ పన్ను బాదుడుకు క్యాష్‌ హ్యాండ్లింగ్‌ ఛార్జీ అని పేరు పెట్టింది. డిజిటల్‌ లావాదేవీలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న అన్నిరకాల మర్చెంట్‌ డిస్కౌంట్‌ రేటులు రద్దు చేసి, ఇకమీదట అన్ని లావాదేవీలను పూర్తి ఉచితంగా నిర్వహించాలని, నగదు చెల్లింపులకంటే డిజిటల్‌ చెల్లింపులు లాభదాయకంగా ఉండేలా ప్రోత్సహించాలని చంద్రబాబు కోరారు. 
 
అలాగే, ఐటీ పరిధిలోకి రానివారికి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుకు రూ.వెయ్యి, బయోమెట్రిక్‌ కొనుగోలుకు రూ.వెయ్యి రాయితీ ఇవ్వాలని చెప్పింది. డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించే వ్యాపారులపై పాత తేదీలతో పన్నులు వేయవద్దని సూచించింది. సంవత్సర ఆదాయంలో ఎవరైనా కొంత భాగాన్ని డిజిటల్‌ రూపంలో ఖర్చు చేసే వినియోగదారులకు ఆ మేరకు పన్ను వెనక్కు ఇవ్వాలని సూచించింది. మెట్రో నగరాల్లోని బస్సులు, సబర్బన్‌ రైళ్లలో కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపులను ప్రోత్సహించాలని సూచించాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి