ఏ1 - ఏ2లు ఈసీని కులంపేరుతో దూషిస్తారా? చంద్రబాబు ఫైర్

సోమవారం, 16 మార్చి 2020 (12:21 IST)
ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకుని, అనేక రకాలైన అవినీతి కేసుల్లో చిక్కుకుని 16 నెలల పాటు జైల్లో ఉన్న ఏ1, ఏ2 అనే నిందితులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్.ఈ.సి)ని కులంపేరుతో దూషిస్తారా అంటూ అంటూ టీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వతంత్రంగా వ్యవహరించే ఎస్ఈసీని కులంపేరుతో దూషించడం నీచాతినీచం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ భయం కారణంగా వాయిదా వేసిన విషయం తెల్సిందే. ఈ మేరకు ఎస్.ఈ.సి రమేష్ కుమార్ శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. దీనిపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విమర్శలు గుప్పిస్తూ, ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే చంద్రబాబు చెప్పినట్టు రమేష్ కుమార్ నడుచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా తెదేపా అధినేత చంద్రబాబే నియమించారని.. ఆయన కులమేనంటూ కూడా జగన్ వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. సోమవారం నాడు టీడీపీ నేతలతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల వాయిదా, రమేశ్ కుమార్ ప్రస్తావన వచ్చింది. 'ఈసీని కులం పేరుతో దూషించడం నీచాతినీచం. 16 నెలలు జైల్లో ఉన్న ఏ1, ఏ2 నిందితులు ఈసీని నిందించడం హేయం. దొంగలు జడ్జిని నిందించడాన్ని ప్రజలే చూస్తున్నారు. కండిషన్ బెయిల్‌లోని నిందితులు రాజ్యాంగ వ్యవస్థ అధిపతిని దూషిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో, న్యాయక్షేత్రంలో వీళ్లకు గుణపాఠం తప్పదు' అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు