పెట్రోల్, డీజిల్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుడిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రంలో ఎక్కువ ధరలు ఉన్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేవరకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు.
అన్ని రాష్ట్రాలకంటే తక్కువకే ఇస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్‌రెడ్డి..ఇప్పుడు మాత్రం ధరలు పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు. అని రాష్ట్రాల్లో తక్కువంటే.. పెట్రోల్ రూ. 94, డీజిల్ రూ. 80 గా ఉందని చంద్రబాబు తెలిపారు.
ఏపీలో మాత్రం ప్రతి వస్తువుపై ధరలు పెరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై 16 రూపాయాలు తగ్గించాలని కోరారు. నిత్యావసరాలు, నాసిరకం మద్యం, ఇసుక, ఆర్టీసీ చార్జీలు, కరెంట్ బిల్లులు ఇలా ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు.