అదేవిధంగా ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సైతం ఓటమి దిశగా పయనిస్తున్నారు. మంగళవారం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న లోకేశ్... వైకాపా ఆభ్యర్థి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోనున్నారు. ఇక్కడ వైకాపా అభ్యర్థి తిరుగులేని ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
మరోవైపు, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎలీజా తొలి విజయం నమోదు చేయగా.. విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి, కృష్ణా జిల్లా పెడనలో జోగి రమేశ్, మచిలీపట్నంలో పేర్ని నాని, చిత్తూరు జిల్లా మదనపల్లిలో నవాబ్ బాషాలు విజయం సాధించారు.
ఇదిలావుండగా, చిత్తూరు జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బతగిలింది. ఈ జిల్లాలో వైకాపా తిరుగులేని ప్రభంజనం సృష్టించనుంది. 14 అసెంబ్లీ స్థానాల్లో 13 చోట్ల కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుంగనూరులో మూడో రౌండ్ ముగిసేసరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందజలో ఉన్నారు. తంబల్లపల్లి వైఎస్సాసీపీ అభ్యర్థి ద్వారాకనాథ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సత్యవేడు, నగరిలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.