ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో చేరారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించారు.
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ కే రాజేశ్ ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్‌తోపాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన వైద్యుల బృందం కాలేయం, మూత్రపిండాల పనితీరు, రక్తం, మూత్ర పరీక్షలు, 2డీ ఎకో, ఈసీజీ, అలర్జీ వంటి పలు పరీక్షలను సూచించింది. చంద్రబాబుకు స్క్రీనింగ్ మొదలైనవి చేశారు.
చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. తీవ్రమైన అలర్జీ, ఇతర వైద్యపరమైన కారణాలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు నాయుడు బుధవారం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే.