ఏపీకి వెళ్లాలి అనుమతివ్వండి : డీజీపీకి చంద్రబాబు లేఖ

ఆదివారం, 24 మే 2020 (14:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సివుందని, అందువల్ల తనకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. నిజానికి కరోనా లాక్డౌన్‌కు ముందు చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్లారు. ఇంతలో లాక్డౌన్ ప్రకటించండంతో ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. 
 
ఈ క్రమంలో లాక్డౌన్ ఆంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలించాయి. దీంతో ఏపీకి వెళ్లేందుకు తనకు అనుమతించాలని చంద్రబాబు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి లభించింది. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దాన్ని పెండింగ్‌లో పెట్టింది. తాను హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లి, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శిస్తానని ఏపీ డీజీపీకి లేఖ రాస్తూ, ఆపై ఆన్‌లైనులో రెండు రాష్ట్రాల డీజీపీలనూ అనుమతి కోరారు.
 
తెలంగాణ డీజీపీ కార్యాలయం వెంటనే అనుమతి మంజూరు చేయగా, ఏపీ డీజీపీ కార్యాలయం ఇంకా స్పందించలేదు. తాను సోమవారం ఉదయం 10.35 గంటలకు బయలుదేరి విశాఖ వెళతానని చంద్రబాబు తన దరఖాస్తులో కోరారు. విశాఖలో బాధితులను పరామర్శించిన అనంతరం రోడ్డు మార్గాన అమరావతి చేరుకుంటానని ఆ లేఖలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు