సంక్షేమంలో ముంచెత్తుతామంటూ ఊదరగొట్టిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు చెత్త సేకరణకూ చార్జీల మోత మోగించేందుకు సిద్ధమైంది. ఇన్నాళ్లూ పట్టణాల్లో జరిపిన ఈ వసూళ్లు.. ఇప్పుడు గ్రామాల్లోనూ జరిపేందుకు ప్రయత్నాలు చేపట్టింది.
త్వరలో 'మన ఊరు మన పరిశుభ్రత' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారుగా 1000కు పైగా గ్రామపంచాయతీల్లో ప్రస్తుతం చెత్త సేకరణకు ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు సమాచారం.
అన్ని జిల్లాల్లోనూ ప్రతి మండలం నుంచి కనీసం రెండు పంచాయతీలను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రోజుకు రూ.2 చొప్పున నెలకు రూ.60 ప్రతి ఇంటి నుంచీ వసూలు చేస్తున్నారు. సంవత్సరానికి సంబంధించిన మొత్తాన్ని ఒకేసారి కట్టించుకుంటున్నారు.
ఈ మొత్తాన్ని వసూలు చేసే బాధ్యతతో పాటు చెత్త సేకరణను పర్యవేక్షించే బాధ్యతను గ్రామ వాలంటీర్లకు అప్పగించారు. నేరుగా యూజర్‌ఛార్జీలు, సేవా రుసుమని అనకుండా అనేక చోట్ల విరాళాల పేరుతో వసూలు ఈ మొత్తాన్ని వసూలు చేస్తుస్తున్నట్లు సమాచారం.