కరోనా కష్టకాలంలో ప్రజలు ఉంటే.. రెండు, మూడు నెలల బిల్లును ఒకేసారి ఇచ్చి శ్లాబు పెంచి వసూలు చేశారని ఆయన ఆరోపించారు. బీజేపీ సీనియర్ నేత సత్యమూర్తి మాట్లాడుతూ... కరోనా కష్ట కాలంలో మోదీ చేపట్టిన చర్యలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.
ఈ ఏడాది పాలనలో అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో పాటు, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. బీజేపీ ఏపీకి చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.