స్వామి వారి దర్శనం చేసుకున్న ప్రతిసారి తాను స్వామి వారి గురించి మాత్రమే మాట్లావాడిని అన్నారు.కాని మొదటిసారిగా నేడు రాజకీయాలు మాట్లాడాల్సి వచ్చిందని దురదృష్టకరమని, అయితే టిటిడి చట్టంలో అర్హత లేనివారికి పాలకమండలి సభ్యులుగా నియమించటం తీవ్ర అపచారమన్నారు.
ఇక్కడికి వచ్చిన ప్రతివారు వారు స్వామి వారి కరుణ కటాక్షాలు పొంది వారి ఆశీస్సులతో తిరిగి వెళతారని అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల, తిరుపతి దేవస్థానం చట్టంలో అసలు లెనేలేని ప్రత్యేక ఆహ్వనితులు అనే పదాన్ని చేర్చటాన్ని ఆయన తప్పుపట్టారు.