అక్టోబరు 15వ తేదీ ఉదయం స్వామి, అమ్మ వార్లకు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా అలంకరణ, రాత్రి 7 గంటలకు గజ వాహనంపై కోవెల ఉత్సవం, 16న ఉదయం ధ్వజారోహణ, 17న ఉదయం 7 గంటలకు సూర్యప్రభ, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనాలపై కోవెల ఉత్సవం, 18న ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై కోవెల ఉత్సవం, రాత్రి 7 గంటల కు ఎదుర్కోలు ఉత్సవం, 8.30కు వెండి శేష వాహనంపై కోవెల ఉత్సవం నిర్వహి స్తామన్నారు.
19న ఉదయం 7 గంటలకు సింహ వాహనంపై కోవెల ఉత్సవం, రాత్రి 7 గంటలకు శ్రీవారి తిరు కల్యాణోత్సవం అనంతరం వెండి గరుడ వాహ నంపై కోవెల ఉత్సవం. 20న రథోత్సవం, 21 ఉదయం 10:30కు చక్రవారి అవభృధో త్సవం, రాత్రి 7కు ధ్వజావరోహణ, 8 గంటలకు అశ్వ వాహనం పై కోవెల ఉత్స వం, 22 ఉదయం 9 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు, ఆర్జిత కల్యాణాలు నిలిపివేస్తామన్నారు.