ప్రశ్నపత్రం లీక్ కేసు : మాజీ మంత్రి నారాయణకు జిల్లా కోర్టు నోటీసులు

శుక్రవారం, 13 మే 2022 (16:27 IST)
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పి.నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ చిత్తూరు జిల్లా కోర్టు ఆయనకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 
 
ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నారాయణ బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు నారాయణకు నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు తదుపరి ఈ నెల 24కి వాయిదా వేసింది. ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు పి.నారాయణను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు