నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ అరెస్టు

మంగళవారం, 10 మే 2022 (12:55 IST)
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థలుగా ఉన్న నారాయణ విద్యా సంస్థ అధినేత, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పి.నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఉన్న నారాయణను స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అదుపులోకి తీసుకున్నారు. 
 
ఏపీలో పేద తరగత పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు టీచర్లు, ఇన్విజిలేటర్లను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. అయితే, ప్రశ్నపత్రాలు నారాయణ, చైతన్య విద్యా సంస్థలకు చెందిన పాఠశాలల్లోనే లీక్ అయినట్టు సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల వ్యాఖ్యానించారు. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న నారాయణను స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ఆయన కారులోనే ఏపీకి తరలించారు. మాజీ మంత్రి నారాయణ వెంట ఆయన భార్య రమాదేవి కూడా ఉన్నారు. అయితే, నారాయణను ఎందుకు అరెస్టు చేశారో సీఐడీ పోలీసులు వెల్లడించకపోవడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు