గోళీలను దంచి మద్యంలో కలిపి ఇచ్చేసింది.. భర్త చనిపోయాక..?

గురువారం, 8 నవంబరు 2018 (12:35 IST)
చిత్తూరు జిల్లాలో హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. బక్కేమారునాయక్‌ను భార్యే హత్య చేసిందని పోలీసుల దర్యాప్తులో తేల్చారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలోనే రేణుమాకులపల్లె పంచాయతీ జోగివానిబురుజు కల్వర్టు వద్ద నవంబర్ నాలుగో తేదీన బక్కేమారునాయక్ హత్యకు గురయ్యాడు. ఈ ఏడాది మే 29వ తేదీ నుండి బుక్కేమారు నాయక్ తప్పిపోయాడు. 
 
ఈ విషయమై బుక్కేమారునాయక్ తనయుడు హరినాయక్ ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో బుక్కేమారునాయక్ భార్య రమణమ్మే అతడిని హత్య చేసిందని పోలీసులు తేల్చారు. బల్లాపురంపల్లెకు చెందిన మదన్‌మోహన్ రెడ్డితో పెట్టుకున్న వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని తేలింది. విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 
 
మే 26న కోటకొండ ఎగువ తండాలో జాతర సందర్భంగా మారునాయక్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య భర్తను చంపాలని ప్లాన్ వేసింది. ఇంట్లో ఉన్న మందు గోళీలను దంచి మద్యంలో కలిపి ఇచ్చింది. దీంతో మారునాయక్ వాంతులతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత తన ప్రియుడు మదన్‌మోహన్‌రెడ్డికి రమణమ్మ ఫోన్ చేసింది.
 
మదన్ మోహన్ రెడ్డి మారునాయక్ మృతదేహన్ని సంచిలో మూటకట్టి ట్రాక్టర్‌లో జోగివానిబురుజు వద్ద కల్వర్టు వద్దకు తీసుకెళ్లి పూడ్చివేశాడు. మదన్ మోహన్ రెడ్డికి మరో ముగ్గురు స్నేహితులు సహకరించారని పోలీసులు తేల్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు