కన్నబిడ్డపై తండ్రి అత్యాచారం.. చూస్తూ మిన్నకుండిన తల్లి...

సోమవారం, 5 నవంబరు 2018 (12:18 IST)
చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. కన్నబిడ్డ పాలిట కన్నతండ్రే కామాంధుడయ్యాడు. మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం తెలిసినప్పటికీ కట్టుకున్న భార్య చోద్యం చూస్తూ వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తనను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి... ఆ యువతి పాలిట రాక్షసుడిగా మారాడు. గత మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని తల్లికి కూడా చెప్పింది. ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు కదా.. భర్తతో కాపురం చేస్తూ వచ్చింది. 
 
ఈ క్రమంలో తండ్రి దారుణాలను తట్టుకోలేని బాధితురాలు చివరకు స్థానికంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిని ఆశ్రయించింది. వెంటనే ఆమె పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు