పాములు రైతును పగబట్టాయి.. ఏకంగా 34సార్లు కాటేశాయి..

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (12:12 IST)
పాములు ఆ రైతును పగబట్టాయి. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా 34 సార్లు నాగుపాములు అతనిని కరిచాయి. 2002 జూన్ నుంచి 2017 మే 29వరకు మొత్తం 34సార్లు అతనిని నాగుపాములు కాటేశాయి. అవి వేసిన కాట్లు ఆయన కాళ్లు, చేతులపై ముద్రల్లా నిలిచాయి.

నాగుపాములు కాటేస్తున్న విషయంపై వైద్యులకు అనుమానం రాగా.. నాగుపాము కాటేసిన ప్రతిసారి నోరు, ముక్కులోంచి రక్తం, నురగ రావడంతో చావు అంచులదాక వెళ్లొస్తున్నాడు. వైద్యుల సూచన మేరకు మందులు తీసుకుంటున్నాడు. 
 
వైద్యం కోసమే దాదాపు రూ.పదిలక్షల వరకు ఖర్చు చేశాడు .దీంతో ఆర్థికంగా చితికిపోయాడు. మందుల కారణంగా శరీరం నిస్సత్తువగా మారింది. ఎక్కువ దూరం నడవలేడు. మునుపటిలా కష్టపడి సేద్యం చేయలేడు. వర్షంలో తడిస్తే వాపులు, గుల్లలు వస్తాయి. దీనికి విరుగుడుగా వేడి పదార్థాలను తీసుకుంటాడు. అయితే పాములు తనపై ఎందుకు పగబట్టాయో అర్థం కావడం లేదని ఆవేదన వెల్లగక్కుతున్నాడు. 
 
చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ ఉప్పలూరివాండ్ల పల్లెకు చెందిన కె.సురేంద్రనాథ్‌ రెడ్డికే ఈ దుస్థితి.  సాధారణ రైతు. 2002 జూన్‌‌లో సురేంద్రనాద్‌ రెడ్డి ఊరికి సమీపంలో పొలం దున్నుతుండగా భూమిని చీల్చుకొంటూ వెళ్తున్న మడకలోంచి బయటకొచ్చిన నాగుపాము ఆయన కాలిని కాటేసింది. వెంటనే వైద్య చికిత్స తీసుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక అప్పటినుంచి అతనిపై పాముల వేట మొదలైందని ఈ రైతు వాపోతున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు