తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు నగరం పోలీసు కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మ(24) అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్ చదువుతూ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తోంది. పూతలపట్టు మండలం వడ్డేపల్లె పంచాయతీ బందార్లపల్లెకు చెందిన భరత్ అమెరికాలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే.. సుష్మను వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదని భరత్ తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ విషయమై ఇరుకుటుంబాల మధ్య పంచాయితీ జరిగింది. అయినా భరత్ పెళ్లికి నిరాకరించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మ సోమవారం అమెరికాలో తాను ఉంటున్న గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సుష్మ బంధువులు గురువారం చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.