3 రాజధానుల కోసం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా
శనివారం, 8 అక్టోబరు 2022 (13:25 IST)
Chodavaram mla karanam dharmasri
ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ రాశారు. రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ఏర్పడిన జాక్‌కి విశాఖలో శనివారం రాజీనామా లేఖను అందజేశారు.
విశాఖలో ఈ నెల 15న భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ.. విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే.. ముమ్మాటికీ అమరావతికి తాము వ్యతిరేకమేనని వ్యాఖ్యానించారు. వీకేంద్రీకరణ కోసం తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు.