అయితే టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా కారు వెనుక అద్దంలో శిలువ గుర్తు, ave Maria అనే అన్యమత శ్లోకంతో ఆ కారు తిరుమలకు వచ్చింది. అయితే ఇది గమనించిన.. కింది స్థాయి అధికారులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ కారును పట్టుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాహనంగా గుర్తించారు.
తాము హిందువులమేనని, తిరుమల యాత్ర కోసం కారు అద్దెకు తీసుకున్నామని వాహనంలోని భక్తులు తెలిపారు. అనంతరం అన్యమత చిహ్నాన్ని తొలగించి దర్శనానికి అనుమతించాలని కోరడంతో విజిలెన్స్ సిబ్బంది సదరు భక్తులను అనుమతించారు.