కృష్ణాజిల్లాలో 12 నుంచి మద్యం దుకాణాల మూసివేత.. ఎందుకో తెలుసా?

మంగళవారం, 2 మార్చి 2021 (10:23 IST)
కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా  ఈ నెల 12 నుంచి 14 వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్టు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఇంతియాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 నుంచి, 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నిర్దేశించిన తేదీల్లో పోలింగ్‌ ప్రాంతాల్లోని అన్ని మద్యం దుకాణాలను మూసివేసి ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు రోజైన ఈ నెల 17న  ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే వరకు జిల్లా అంతటా డ్రైడేగా ప్రకటించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు