కృష్ణా జిల్లాలో మొదలైన కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌

సోమవారం, 28 డిశెంబరు 2020 (19:59 IST)
కృష్ణా జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ డైరన్‌‌(వ్యాక్సిన్‌ మాక్‌ డ్రిల్‌) ప్రారంభమైంది. కొ-విన్‌ యాప్‌ పరిశీలన, వ్యాక్సిన్‌ పంపిణీలో తలెత్తే సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఐదు చోట్ల కోవిడ్ వాక్సిన్ డ్రైరన్‌ను నేడు ప్రారంభమై0ది.
 
ప్రకాశ్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్, వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీహరి,డి యం హెచ్ ఓ డా. యం.సుహాసిని, డి ఐ ఓ డా.శర్మిష్ఠ తదితరులు పాల్గొన్నారు.
 
రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేటలోని పూర్ణా హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌, కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తాడిగడప సచివాలయం-4, ప్రకాష్‌నగర్‌ పీహెచ్‌సీలలో డ్రైరన్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు. 
 
టీకా డ్రైరన్‌కు ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బంది, 3 గదులను ఏర్పాటు చేశామన్నారు. మొదటి గదిలో రిజిస్ట్రేషన్‌, రెండో గదిలో వ్యాక్సినేషన్‌, మూడో గదిలో పరిశీలన జిల్లాలో ఐదు కేంద్రాల్లో నిర్వహించే డ్రైరన్‌ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరించి కార్యాచరణ నివేదికను రాష్ట్ర, జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌లకు అందిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు