ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పని విషయంలోతన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే పోటీ అని, ఖచ్చితంగా ఆయనను అధిగమిస్తానని చెప్పారు.
ముఖ్యంగా ఐటీ పరిశ్రమతో తనకు ఉన్న పరిచయాలతో ఏపీకి పెట్టుబడులను తీసుకొస్తానన్నారు. వాస్తవానికి మంత్రిని కాకముందు నుంచే పెట్టుబడుల కోసం తాను యత్నించానని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారిక హోదాలో తన లక్ష్యాన్ని సాధిస్తానని చెప్పారు. పెట్టుబడులను తీసుకొచ్చేందుకు గతంలో తాను చేసిన ప్రయత్నాలను అప్పట్లో వైసీపీ అడ్డుకుందని విమర్శించారు.