ఎన్నికల వ్యూహాలు రచించడంలో నాకంటే మొనగాళ్లు ఎవరు.. ఎంపీలతో చంద్రబాబు

మంగళవారం, 11 జులై 2017 (14:37 IST)
ఎన్నికల వ్యూహాలు రచించడంలో తనకంటే మొనగాళ్లు ఎవరున్నారనీ తమ పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సలహాదారుగా నియమించుకోవడంపై సీఎం స్పందించారు.
 
ఇదే అంశం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన నేతలతో మాట్లాడుతూ తన 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయజీవితంలో ఎన్నో ఎన్నికలు చూశానని, తానే స్వయంగా 14 ఎన్నికలు నిర్వహించానని గుర్తుచేశారు. అలాంటపుడు తనకంటే ఎన్నికల వ్యూహాలు ఎవరికి బాగా తెలుసని ఆయన ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా గుంటూరు వేదికగా జరిగిన వైకాపా ప్లీనరీ సమావేశంలో జగన్ ఇచ్చిన తొమ్మిది వాగ్దానాలపై కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేగానీ, కొత్తగా జగన్ ఇచ్చిన హామీలేవీ లేని చంద్రబాబు తేలికగా తీసిపారేశారు.

వెబ్దునియా పై చదవండి