ఒక పక్క రాష్ట్రంలో వివిధ సమస్యల పరిష్కారం... మరో పక్క రాజకీయ ఎదురు దాడులు, ఇంకో పక్క తనపై అక్రమాస్తుల కేసులు... ఇన్ని టెన్షన్ల మధ్య ఎపీ సీఎం కూల్ గా పెళ్ళిళ్ళకు హాజరవుతున్నారు. అదో రకం స్ట్రెస్ రిలీఫ్ తోపాటు, తన కోసం పనిచేస్తున్న ఉన్నతాధికారుల ఆహ్వానాన్ని మన్నించినట్లు కూడా ఉంటుందని సీఎం జగన్ భావిస్తున్నట్లున్నారు.
ఏపీలోనే కాదు... దేశంలో తనకు ఆప్తులైన ఎవరు తనని పెళ్ళికి ఆహ్వానించినా, ఆయన ఎలాగోలా వీలు చూసుకుని, షెడ్యూల్ చేసుకుని మరీ జగన్ పెళ్ళి రిసెప్షన్ లకు హాజరవుతున్నారు. అక్కడ ఎంత సేపు ఉంటారనేది ముఖ్యం కాదు... పది నిమిషాలైనా వచ్చి, వధూవరులను వచ్చి ఆశీర్వదించాలనేది కాన్సెప్ట్.
ఎంతో టెన్షన్ లో ఉన్నా కూడా, విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిని శ్రీనివాసులు కుమార్తె వివాహా రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. విజయవాడలోని హోటల్ వివంతాలో జరిగిన వేడుకలో వధువు పావని మనోజ్ఞ, వరుడు ప్రణేష్ సాయిలను ఆశీర్వదించారు ముఖ్యమంత్రి.
తనను నమ్మినవారిని, తనకోసం పనిచేస్తున్న వారిని సీఎం జగన్ ఎపుడూ గుర్తుంచుకుంటారని, ఎంత తీరిక లేకున్నా, వారి ఆహ్వానాన్ని మన్నించి శుభ కార్యాలకు హాజరవడం ఆయన కమిట్ మెంట్ కి నిదర్శనమని జగన్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.