ఆంధ్రప్రదేశ్ లో అంతా మందు మయంగా ఉందని, మందు బాబులను ఆకట్టుకుంటూ, వైసీపీ, బీజేపీలు ముందుకు వెళుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. మద్యం ప్రియుల ఓట్లు పడితే గెలిచిపోతామని బీజేపీ భావిస్తుంటే, మందుబాబులకు వచ్చిన కష్టం ఇపుడు తొలగేలా వైసీపీ చూసుకుంటోందన్నారు.
బిజెపి అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.70 లకు అమ్మిస్తానని సారాయి వీర్రాజు మేనిఫెస్టోలో పెడతామంటున్నారని, అందుకే బహిరంగ సభలో మరీ చెప్పారని పేర్కొన్నారు. రెండున్నరేళ్లు సొంత బ్రాండ్ లు అమ్మిన జగన్ సర్కార్ ఇప్పుడు ప్రీమియం బ్రాండ్లు అమ్ముతామంటోందని హేళన చేశారు.
మద్య నిషేధం, దశలవారీ మద్య నియంత్రణ హామీలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని సిపిఐ నేత రమకృష్ణ విమర్శించారు. మొత్తం మీద వైసిపి, బీజేపీలు మందుబాబుల ఓట్లు కొల్లగొట్టేందుకు పథక రచన చేస్తున్నాయన్నారు.