ప్రతిపక్షంలో ఉన్నవారు దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. తిట్లు విని భరించలేని అభిమానులు స్పందిస్తున్నారు. కావాలని తిట్టించి వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు. వైషమ్యాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు. విపక్షం కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోంది అని జగన్ ఆరోపించారు.
ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికలలో ప్రతిపక్షానికి స్థానమే లేకుండా ప్రజలు మాకు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. ఇంత ప్రేమ, ఆప్యాయతలు చూపిస్తుంటే, జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఇలా దుర్భాషలాడుతున్నాయని సీఎం చెప్పారు.