కనకదుర్గ ఆలయంలో అభివృద్ధి పనులు.. సీఎం జగన్ శంకుస్థాపన

గురువారం, 7 డిశెంబరు 2023 (10:46 IST)
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విజయవాడలో పర్యటించి కనకదుర్గ ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.అలాగే పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం కనకదుర్గా దేవిని దర్శించుకున్నారు.
 
సీఎం పర్యటన ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈఓ రామారావు, పోలీసు కమిషనర్ కేఆర్ టాటా, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. రూ.225 కోట్ల అంచనా వ్యయంతో దుర్గ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరమ్మతులు చేపట్టాలన్నారు. 
 
ఇందులో భాగంగా ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారంగా నాలుగు అంతస్తుల ఆటోమేటిక్ కార్ పార్కింగ్‌ను సిద్ధం చేస్తున్నారు. కొండచరియలు విరిగిపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సత్యనారాయణ తెలిపారు. దుర్గమ్మ గుడిలో అభివృద్ధి పనులు 18 నెలల్లో పనులు పూర్తవుతాయని, ఎన్నికల సమయంలో కూడా పనులు పురోగమిస్తాయన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు