అతడి వేధింపులు తట్టుకోలేని ఆ మహిళ ఉద్యోగం మానేసింది. ఉద్యోగం వదిలేసి వెళ్లినా కామాంధుడు మాత్రం వదల్లేదు. ఆమె ఫోనుకి అసభ్య సందేశాలను పంపుతూ, ఫోన్లో అసభ్యమైన పదజాలంతో వేధించడం మొదలుపెట్టాడు. దీనితో బాధితురాలు ఫోన్ తీయడం మానేసింది. దీంతో అతడు నేరుగా ఇంటికే వచ్చేసాడు.
మొన్న ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోకి ప్రవేశించి ఆమె చీరను లాగుతూ దారుణంగా ప్రవర్తించాడు. ఆ కామాంధుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు అతడిపై విజయవాడ భవానీపురం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఐతే సదరు కామాంధుడు పలుకుబడి ఉపయోగించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. అతడిని కఠినంగా శిక్షించాలనీ, అతడి వల్ల తనకు ముప్పు వుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.