వైకాపా ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు ముక్కలాటలోని మర్మాన్ని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు బట్టబయలు చేశారు. నవ్యాంధ్రకు మూడు రాజధానులు ఉండబోవని, ఏకైక రాజధానిగా విశాఖ నగరం ఒక్కటే ఉంటుందని స్పష్టం చేశారు. పైగా, ఇకపై పాలన అంతా విశాఖ నుంచే సాగుతుందని ఆయన కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
శ్రీకాకుళంలో "మన విశాఖ - మన రాజధాని" పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, అమరావతి రైతుల పాదాయాత్ర ముసుగులో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగివుందన్నారు. ఒరిస్సా రాష్ట్రంలో కటక్‌లో హైకోర్టు ఉందన్నారు. భువనేశ్వర్‌లో పరిపాలనా రాజధాని ఉందని గుర్తుచేశారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వికేంద్రీకరణ జరుగుతుందన్నారు.