కానీ వారాంతం కావడంతో నిన్న అధికసంఖ్యలో తిరుపతికి భక్తులు తరలివచ్చారు. ముఖ్యంగా రెండవ శనివారం కావడంతో తమిళనాడు రాష్ట్రం నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. నిన్న టోకెన్లను పొందిన భక్తులకు 23, 24 తేదీల్లో దర్సనానికి సంబంధించిన టోకెన్లను అందజేశారు.
నిన్న మధ్యాహ్నం నుంచి తెల్లవారుజాము వరకు పిల్లలు, వృద్ధులతో గంటల తరబడి వేచి ఉండి టోకెన్లను పొందారు. అయితే ఈరోజు ఉదయం టోకెన్లను పొందిన భక్తులకు రేపు దర్సనాన్ని కేటాయిస్తూ టోకెన్లను అందజేశారు. దీంతో భక్తుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. సర్వర్‌ను టిటిడి సరిగ్గా పెట్టుకోవడం లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. విష్ణునివాసం వెనుక వైపు ఉన్న రైల్వేస్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించారు.