టిక్కెట్లు లేకుంటే తిరుమలకు నో ఎంట్రీ, వైకుంఠ ఏకాదశికి టిటిడి కఠిన నిర్ణయాలు

గురువారం, 17 డిశెంబరు 2020 (21:14 IST)
కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను వైకుంఠ ఏకాదశి దర్శనానికి అనుమితిస్తున్నట్లు  టిటిడి ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. తిరుపతిలో టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో సిఫారసు లేఖలను దర్శనంకు అనుమతించమమన్నారు. 10 రోజుల దర్శనం టిక్కెట్లు ఇది వరకు కేవలం 10 గంటల్లోనే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ అయినట్లు చెప్పారు. 
 
తిరుపతి స్థానికుల కోసం ఈ నెల 24 నుంచి ప్రత్యేక కౌంటర్లలో టిక్కెట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. 7 వేల టికెట్లను స్థానికులకు ఇస్తామన్నారు. రాజ్యాంగ పదవులలో ఉన్న వారికి మాత్రమే ప్రొటోకాల్‌ను అనుసరించి విఐపి బ్రేక్ దర్శన టిక్కెట్లు ఇస్తామని.. సిఫారసు లేఖలు ఇవ్వద్దని విఐపిలకు విజ్ఞప్తి చేశారు ఇఓ. తిరుమలలోని అంజనాద్రి హనుమంతుని జన్మస్థానం అని చాలా మంది నా దృష్టికి తీసుకువచ్చామన్న ఇఓ.. ఆధారాలతో నిరూపితమైతే ఆ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తామన్నారు. 
 
అందుకే పండితులతో కమిటీ వేశామని.. ఆ కమిటీ అంజనాద్రికి అనుకూలమైన ఆధారాలు సేకరించేపనిలో ఉందన్నారు. మిగతా ప్రాంతాలు కూడా హనుమంతు జన్మస్థానం అని ప్రచారం ఉందని.. వాటిని కూడా పరిశీలించమని కమిటీకి చెప్పామన్నారు. మూడు నెలల్లో కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. టిటిడిలో పనిచేయడం గత జన్మ పుణ్యం... ఎస్వీ భక్తి చానెల్ పోర్న్ లింక్ వ్యవహారం సరికాదన్నారు. ఈ ఘటనలో ఉద్యోగులను సస్పెండ్ చేసామన్నారు. ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు.
 
ఈనెల 25వ తేదీ ఉదయం 4 గంటలకు వైకుంఠ ద్వారం తెరుస్తామని టిటిడి అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ద్వారం తెరిచి ఉంచి 10 రోజులు కేవలం టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే కొండపైకి అనుమతిస్తామన్నారు.  భక్తుల శరీర ఉష్ణోగ్రత గుర్తించడం జరుగుతుందని.. వాహనాల సానిటైజ్ కొనసాగుతుందన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 18 వేల దర్శనం టిక్కెట్లు ఇది వరకే మంజూరు చేసామని.. కావాల్సినన్ని లడ్డూలు భక్తులకు సిద్ధం చేస్తున్నామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు