ఈ నెల 25వ తేదీ వైకుంఠ ఏకాదశి, జనవరి 1వ తేదీన వెయ్యి కోట్ల చొప్పున శ్రీవాణి ట్రస్టు ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. మిగిలిన ఎనిమిది రోజుల పాటు రోజుకు రెండువేల చొప్పున శ్రీవాణి ట్రస్ట్ నుంచి జారీ చేయనున్నారు. శ్రీ వాణి ట్రస్ట్‌కు పదివేల రూపాయల విరాళం ఇవ్వడంతో పాటు ఐదువేల రూపాయలు చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు వైకుంఠ ద్వార దర్సనం లభిస్తుంది.
తిరుపతిలోని మున్సిపల్ కార్యాలయం, రామచంద్ర పుష్కరిణి వద్ద, మహతి ఆడిటోరియం, రామానాయుడు స్కూలు, ఎం.ఆర్.పల్లిలోని న్యూ మార్కెట్ వద్ద టోకెన్లను అందించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు.