శ్రీహరికోట, సూళ్లూరుపేటల్లో మళ్లీ కరోనా

సోమవారం, 29 మార్చి 2021 (04:01 IST)
శ్రీహరికోట, సూళ్లూరుపేట ల్లో మళ్లీ కరోనా డేంజర్‌ బెల్స్‌ ప్రారంభమయ్యాయి. 10 రోజుల క్రితం షార్‌లో ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అలాగే సూళ్లూరుపేటలోని షార్‌ కాలనీలలో సైతం కరోనా కేసులు బయటపడ్డాయి.

ఇలా ఇప్పటికి షార్‌ ఉద్యోగుల కుటుంబాల్లో సుమారు 20 మంది కరోనా బారినపడ్డట్లు సమాచారం. సూళ్లూరుపేటలో ఈనెల 25న 3 కేసులు బయటపడటం విశేషం.
 
కరోనాపై అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం డీఎం బండ్ల కుమార్‌ సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. అలాగే మున్సిపల్‌ కమిషనర్‌ నరేంద్రకుమార్‌ కొవిడ్‌ కేసులు బయటపడిన ప్రాంతాలలో పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. 
 
సూళ్లూరుపేట మండలంలోని వెంగళాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉధ్యాయుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆ పాఠశాలను మూసివేసి నట్లు ఎంఈవో మస్తానయ్య తెలిపారు.

ఈ పాఠశాలలో ఇద్దరు టీచర్ల ఉన్నారు. మరో టీచర్‌ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిసింది. అయితే ఆ పరీక్షల ఫలితం ఇంకా  రాలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు