మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి కరోనా

సోమవారం, 14 సెప్టెంబరు 2020 (23:16 IST)
పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మరియు వారి కుమారుడు ముత్తంశెట్టి వెంకట శివ సాయి నందీష్ కు కరోనా సోకినందున ఇంటివద్దనే హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్నారు.

ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి తెలియజేశారు. కావున సందర్శకులు ఎవరు కలవడానికి రావద్దని కోరుతూ ఒక ప్రకటనలో తెలియజేశారు.

కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎవరికి ఏ సమస్య వచ్చినా వారిని ఫోన్ లో సంప్రదించవచ్చునని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు