సాధారణంగా హారర్ సినిమాలంటే భయాన్ని ఎలివేట్ చేస్తూ ఒక దెయ్యం కథ చెప్పడం జరుగుతుంది. కానీ కిష్కింధపురిలో హారర్ తో పాటు మంచి సైకలాజికల్ పాయింట్ కూడా యాడ్ చేసి చెప్పడం చాలా బాగుంది. శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా ప్రమాదకరమని చెప్పడం, మనిషికున్న బాధలు కష్టాలు పక్కన వాళ్ళకి చెప్పుకోకుండా ఒంటరితనం అనుభవిస్తుంటే వచ్చే ప్రమాదాలు, పరిణామాలు చాలా సమర్థవంతంగా చిత్రీకరించారు డైరెక్టర్ కౌశిక్.