తిరుపతిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ

బుధవారం, 10 జూన్ 2020 (16:59 IST)
కరోనా అంటేనే వణికిపోతున్న సమయమిది. అందులోను కరోనా వచ్చి గర్భవతి అయితే.. అమ్మో అనుకునే వారు చాలామందే వున్నారు. అలాంటి స్థితిలో గర్భిణికి తిరుపతిలోని ప్రసూతి ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ.
 
సరిగ్గా 10 రోజుల క్రితం ఒక మహిళకు కరోనా లక్షణాలతో వచ్చింది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చినప్పటికే ఆమె 9 నెలల గర్భవతి. ప్రసవ తేదీని కూడా వైద్యులు ఇచ్చారు. నిన్న ఉదయం నుంచి పురిటినొప్పులతో బాధపడుతుండటంతో ఆమెను ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తరలించారు.
 
నిన్న రాత్రి 9 గంటలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ మహిళ. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. అయితే బిడ్డకు రిపోర్టులో నెగిటివ్ వచ్చింది. దీంతో తల్లికి దూరంగా బిడ్డను ఉంచారు వైద్యులు. జాగ్రత్తగా కరోనా పాజిటివ్ మహిళకు చికిత్స చేశారు. గతంలో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఇదేవిధంగా పాజిటివ్ వచ్చిన మహిళకు చికిత్స చేయగా తిరుపతిలో మొదటిసారి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చికిత్స చేశారు. బిడ్డకు నెగిటివ్ రావడంతో ఆసుపత్రి వైద్యులే ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు