మొదటి రాయి మిస్, రెండో రాయి హిట్: జగన్ రాయి దాడి నిందితుడు

ఐవీఆర్

గురువారం, 18 ఏప్రియల్ 2024 (20:38 IST)
విజయవాడ సింగ్ నగర్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడు సతీశ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాయి దాడి కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు.
 
రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిందితుడు సతీష్ రెండుసార్లు రాయి విసిరాడు. మొదటిసారి విసిరిన రాయి తగలకుండా మిస్ అయిందనీ, అందువల్ల రెండవసారి మళ్లీ రాయి వేసినట్లు పేర్కొన్నారు. రాయితో ముఖ్యమంత్రి జగన్ పైన దాడి చేయాలని దుర్గారావు అనే వ్యక్తి చెప్పాడనీ, అతడి మాట ప్రకారం దాడి చేసాక తిరిగి అతడికి ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చిందని పేర్కొన్నారు. 
 
మరోవైపు నిందితుడు సతీష్ తల్లి కోర్టు ముందు కన్నీటిపర్యంతమైంది. తమకేమీ తెలియదనీ, రోజు కూలీ చేసుకుని బతుకుతామని అన్నారు. 200 రూపాయల కోసం కక్కుర్తి పడ్డామనీ, ర్యాలీకి వస్తే డబ్బు ఇస్తామంటే వెళ్లామని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడు లేకపోతే తాము చచ్చిపోతామంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

చ*చ్చిపోతా..#JaganStoneCaseAccusedSatishMother#VijayawadaCourt #LawyerRajini#CMJagan #YCP #APPolitics#APElections2024 #TV5News pic.twitter.com/RpFl11361Q

— TV5 News (@tv5newsnow) April 18, 2024

జగన్ పై గులకరాయి వేసినప్పుడు, లైట్లు లేవు, చుట్టూ స్పాటర్స్ సెక్యూరిటీ లేదు. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఆదేశాలు ఇచ్చాం.

ఎలక్షన్ కమిషన్ లేవనెత్తిన విషయాలే ఏపి మొత్తం అడుగుతుంది. కరెంటు ఎందుకు లేదు, మీ సెక్యూరిటీ ఎందుకు కూర్చుని ఉంది ? #KodiKathiDrama2 #EndOfYCP #YCPAnthampic.twitter.com/x6e7oUhKhl

— Telugu Desam Party (@JaiTDP) April 18, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు