సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ గురువారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశం జరిగిన అనంతరం జరిగిన వివిధ పరిణామాలపై మాట్లాడుకున్నారు. మార్చి ఒకటవ తేదీన గుంటూరులో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి రావలసిందిగా రామకృష్ణ, శ్రీ పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు.
కాగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేందుకు జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కమిటీని ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఇదిలావుంటే మార్చి 4వ తేదీ లోపుగా కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డికి బదులిచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరిణామాల నేపధ్యంలో ఎలాంటి అడుగులు వేస్తారో చూడాల్సి వుంది.