ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

చిత్రాసేన్

శుక్రవారం, 10 అక్టోబరు 2025 (17:03 IST)
Tribanadhari Barbarik poster
మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్ బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన త్రిబాణధారి బార్బరిక్ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మీడియా, సోషల్ మీడియా నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.
 
ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్ ఫ్లాట్ ఫాంలో ఈ రోజు (అక్టోబర్ 10) నుంచి అందుబాటులో ఉంటుంది. సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సాంచీ రాయ్, క్రాంతి కిరణ్ వంటి వారు నటించిన ఈ మూవీకి ఇన్ ఫ్యూజన్ బ్యాండ్ సంగీతాన్ని అందించింది. చాలా ఏళ్లకు ఉదయభాను కనిపించడం, నటించడం, మాస్ సాంగ్‌కు స్టెప్పులు వేయడంతో జనాల్లో ఎక్కువ క్యూరియాసిటీ పెరిగింది.
 
టెక్నికల్‌గా మూవీ హై స్టాండర్డ్స్‌లో ఉందని అందరూ ప్రశంసించిన సంగతి తెలిసిందే. మేకర్ మోహన్ శ్రీవత్సకు, నిర్మాత విజయ్ పాల్ రెడ్డికి ‘త్రిబాణధారి బార్బరిక్’ అయితే మంచి పేరును తెచ్చి పెట్టింది. ఇక రిలీజ్ సమయంలో దర్శకుడు తీవ్ర భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. థియేటర్లో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీని చూసి ఆస్వాధించే సమయం వచ్చింది. అందరినీ ఆకట్టుకునే ఈ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను తప్పకుండా చూడండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు