క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడి యువకుడు బలి, ఎక్కడ?

బుధవారం, 11 నవంబరు 2020 (18:38 IST)
నేటితరం యువత జూదాలకు, బెట్టింగ్‌లకు పాల్పడి తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. క్రికెట్ ఎంతో ప్రామాణికతో కూడున్నది. అటువంటి క్రీడల్లో సాధించాల్సిన యువత వాటిని జూదాలుగా మార్చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడు ప్రాణాలు బలితీసుకుంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో దిగి లక్షల్లో కోల్పోయిన ఇద్దరు యువకులు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు.
 
వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. గుంటూరు జిల్లా పెదకూరు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన సురేశ్, బెల్లంకొండకు చెందిన కొమరయ్య ఇద్దరూ బెల్లంకొండలోని రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లారు. అప్పటికే దారిలో వారు పురుగుల మందు తాగారు. వీరిని కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ మృతి చెందగా శంకర్ పరిస్థితి విషమంగా ఉంది.
 
క్రికెట్ బెట్టింగ్‌లో తాము లక్షల్లో నష్టపోయామని ఆ బాకీలను తీర్చాలని నిర్వాహకుడు ఒత్తిడి చేయడంతో తాము చనిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. దీంతో పురుగుల మందు తాగుతున్నామంటూ సెల్ఫీ తీసి వాటిని తమ బంధువులకు పంపించారు. కేవలం క్రికెట్ బెట్టింగ్ వల్లే సురేశ్ చనిపోయాడని దీనికి సంబంధించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మృతుడు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్‌కు మరొకరు బలి కాకూడదని వేడుకుంటున్నామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు