హీరో శివాజీ - రవిప్రకాష్‌లు తోడుదొంగలా? లుకౌట్ నోటీసు జారీ

శనివారం, 18 మే 2019 (14:42 IST)
టీవీ9 మాజీ రవిప్రకాష్, హీరో శివాజీల కోసం పోలీసులు గత కొన్ని రోజులుగా గాలిస్తున్నారు. కానీ, వారిద్దరూ ఎక్కడ ఉన్నారన్న ఆచూకీ మాత్రం చిక్కడం లేదు. ఫోర్జరీ సంతకాలు, నిధులు మళ్లింపు, టీవీ 9 లోగో విక్రయం తదితర కేసుల్లో వీరిద్దరూ సైబరాబాద్ పోలీసుల ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సివుంది. కానీ, ఇందుకోసం వారు నోటీసులు జారీచేయలేదు. పైగా, వారిద్దరికీ ఇచ్చిన గత బుధవారంతోనే ముగిసిపోయింది. అయినప్పటికీ వారిద్దరూ అజ్ఞాతం వీడలేదు.
 
ఈ నేపథ్యంలో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌, హీరో శివాజీలపై సైబరాబాద్‌ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. రవిప్రకాశ్‌తో పాటు సినీ నటుడు గరుడ పురాణం శివాజీ, మాజీ సీఎఫ్‌వో మూర్తికి కూడా శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. వీరిరువురు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. 
 
కాగా ఇప్పటికే రవిప్రకాశ్‌ పాస్‌పోర్టును పోలీసులు సీజ్‌ చేసిన విషయం విదితమే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రవిప్రకాశ్‌తో పాటు శివాజీకి పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా... వారు గైర్హాజరు అయ్యారు. దీంతో వాళ్లకు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో రవిప్రకాశ్‌, శివాజీలను సైబరాబాద్ పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు