శుక్రవారం రాత్రికి ''ఫణి'' తీరం దాటుతోంది. ఫణి పడగెత్తడంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలపై పెను ప్రభావం చూపనుంది. బుధవారం రాత్రికి పూరీకి దక్షిణ నైరుతి దిశగా 570, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ ఒడిశాలోని గోపాల్‌పూర్- చాంద్‌బలీ మధ్య పూరీకి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం తీరాన్ని దాటనుంది.
తీరాన్ని దాటే సమయంలో గంటకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. గంటకు 200 కిలో మీటర్ల వేగంతో భీకర గాలులతో పెను ముప్పు తప్పదని ఉత్తరాంధ్ర, ఒడిశా వాసులు ఆందోళవ వ్యక్తం చేస్తున్నారు.