బురేవి ... ఆంధ్రప్రదేశ్‌కు తప్పిన వాయుగండం

బుధవారం, 2 డిశెంబరు 2020 (09:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర తుఫాను అల్లకల్లోలం సృష్టించింది. ఈ తుఫాను అపారనష్టాన్ని మిగిల్చింది. అయితే, ఈ తుఫాను సృష్టించిన అలజడి నుంచి కోలుకోకముందే ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారగా, దీనికి బురేవి అనే పేరు పెట్టారు.
 
అయితే, వాయుగుండం కాస్త తీవ్రవాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది శ్రీలంకకు సమీపంలో కొనసాగుతోంది. ఈ తుఫానును బురేవిగా పిలవనున్నారు. ప్రస్తుతం ఈ తుఫాను శ్రీలంకలోని ట్రింకోమలీ తీరానికి తూర్పు, ఆగ్నేయ దిశగా 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 
 
బురేవి డిసెంబరు 2 సాయంత్రం తర్వాత ట్రింకోమలీ రేవు పట్టణం సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. డిసెంబరు 3 ఉదయం మన్నార్ సింధుశాఖలో ప్రవేశించి దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకుతుందని వివరించింది. దీని ప్రభావంతో తమిళనాడు, కేరళ, దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఇంతకుముందు ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు