దివాకర్‌రెడ్డికి రూ.100 కోట్ల జరిమానా!

బుధవారం, 2 డిశెంబరు 2020 (06:46 IST)
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ుంబంపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. తాజాగా మరో దిగ్భ్రాంతికర నిర్ణయానికి తెగబడింది.

జేసీకి ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ అధికారులు అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో భారీ జరిమానా విధించారు. త్రిశూల్‌ సిమెంట​ ఫ్యాక్టరీలో జేసీ భారీ ఎ‍త్తున అక్రమాలకు పాల్పడ్డారని రూ.100 కోట్ల జరిమానా విధించాలని నిర్ణయించారు.

రూ. 100 కోట్ల జరిమానా కట్టకపోతే ఆర్అండ్ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తు చేపడతామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపి.. 14 లక్షల మెట్రిక్ టన్నుల దోపిడీ జరిగినట్లు అధికారులు గుర్తించారు.

విలువైన లైమ్ స్టోన్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వి విక్రయించారని అభియోగాలు నమోదు చేశారు. తన ఇంట్లో పనిచేసే పనిమనుషులు, డ్రైవర్ల పేరుతో త్రిశూల్ సిమెంట్స్ అనుమతులు పొందారు. అంతేకాకుండా అనుమతులు వచ్చాక పనిమనుషుల నుంచి కుటుంబ సభ్యులకు వాటాలు బదలాయింపు ప్రక్రియను చేపట్టారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అ‍డ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడిన జేసీ బాగోతాలు ఇప్పటికే అనేకం బయటపడ్డాయి. అక్రమ మైనింగ్‌తో పాటు జేసీ ట్రావెల్స్‌ నింబంధనల ఉల్లంఘనపై కూడా అధికారులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

మరోవైపు అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో దివాకర్‌రెడ్డి కుటుంబీకులు నిర్వహిస్తున్న సుమన, భ్రమరాంబ మైనింగ్‌ సంస్థల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించామని అధికారులు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు