మరోవైపు, గతంలో ఎన్టీఆర్ నుంచి రాజబాబు వరకు ఎవరి సినిమాలైనా గతంలో టికెట్ ధరలు ఒకేలా ఉండేవని.. సినిమా బాగుంటే ఎక్కువ రోజులు ఆడేవన్నారు. కానీ ఇప్పుడు టిక్కెట్ ధరను రూ.500 వరకు పెంచేసి వారం రోజుల్లోనే పెట్టుబడులు రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలుగు సీనీ పరిశ్రమకు పవన్ కల్యాణ్ పెద్ద గుదిబండగా మారారని సజ్జల విమర్శించారు.
ప్రభుత్వ తీసుకువచ్చిన విధానం వల్ల ఎన్టీఆర్ సినిమా అయినా.. కాంతారావు సినిమా అయినా టికెట్ ధర ఒకేలా ఉంటుందని అన్నారు. ప్రేక్షకుడికి సరసమైన ధరకు వినోదం లభిస్తుందంటే పవన్ ఎందుకు వద్దంటున్నారో చెప్పాలన్నారు. సినిమా టికెట్ల వల్ల బహుశా రూ.200 కోట్లు వస్తాయేమోనని.. దాంతో ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుంటుందని, ఈ విషయాన్ని కూడా పవన్ చెబితే.. బాగుంటుందని సజ్జల వ్యాఖ్యానించారు.