హీరో తనీష్ నిర్వహిస్తున్నఎఫ్ క్లబ్ లో పార్టీలకు రవితేజ హాజరయినట్లు ఆరోపణలున్నాయి. దీనితో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో రవితేజను రెండో సారి ఈడీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ఛార్మి, రకుల్, పూరీ సహా సినీ ప్రముఖులు ఐదుగురిని ఈడీ ప్రశ్నించింది.
అయితే, రెండు రోజుల నుంచి ఈడీ విచారణ రూటు మార్చినట్లుంది. మాదక ద్రవ్యాల సూత్రధారి కెల్విన్ ఈడీకి సరెండర్ కావడంతో కేసు మలుపు తిరిగింది. ఈసారి కెల్విన్ తో పాటు హీరో రవితేజను విచారించే అవకాముంది. అంటే, ప్రస్తుతం కెల్విన్ వాంగ్మూలం ఆధారంగా ఈడీ కేసు విచారణ కొనసాగుతోంది. నిన్న కెల్విన్ తోపాటు రానాను విచారించిన అధికారులు, ఇవాళ కూడా కెల్విన్ సమక్షంలోనే రవితేజ విచారణ కొనసాగించున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వ్యవహారం, మనీలాండరింగ్ పై రవితేజను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు.